చాలా కాలం తర్వాత టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వస్తున్నా మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రమే “బ్రో”. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్రఖని అయితే తెరకెక్కించారు. మరి రిలీజ్ కి దగ్గరకి వచ్చేసిన ఈ చిత్రం అయితే మొత్తానికి సాలిడ్ హైప్ ని తెచ్చుకోగలిగింది.
ఇక ఈ చిత్రం అయితే వరల్డ్ వైడ్ గా భారీ టార్గెట్ పెట్టుకొనే రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ ఒక్కటే సుమారు 100 కోట్లు జరిగినట్టుగా తెలుస్తుంది. దీనితో మళ్ళీ రీమేక్ అయినప్పటికీ మరో భారీ టార్గెట్ తోనే పవన్ వస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు ఫీమేల్ లీడ్ లో నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.