నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న. డిసెంబర్ 21, 2023 న ఈ చిత్రాన్ని థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి గాజు బొమ్మ పాటను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా గాజు బొమ్మ ప్రోమో ను రిలీజ్ చేశారు.
గాజు బొమ్మ ప్రోమో వీడియో చాలా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 6 వ తేదీన ఉదయం 11:00 గంటలు ఈ గాజు బొమ్మ పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Promo 🙂#GaajuBomma ♥️#HiNanna pic.twitter.com/gPFWyCLHQu
— Hi Nani (@NameisNani) October 5, 2023