‘హాయ్ నాన్న’ నుండి ‘గాజు బొమ్మ’ సాంగ్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్

‘హాయ్ నాన్న’ నుండి ‘గాజు బొమ్మ’ సాంగ్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్

Published on Oct 6, 2023 1:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల దీనిని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా రేపు ఈ మూవీ నుండి గాజు బొమ్మ అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

తాజాగా ఈ సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ అందరినీ అలరిస్తోంది. కాగా మ్యాటర్ ఏమిటంటే గాజు బొమ్మ లిరికల్ వీడియో సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఉదయం 11 గం. లకు రిలీజ్ చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితం హాయ్ నాన్న మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తండ్రి కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కుతుండగా ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు