“సూర్య సన్నాఫ్ కృష్ణన్” తెలుగు రిలీజ్ కి డేట్స్ ఫిక్స్.!

“సూర్య సన్నాఫ్ కృష్ణన్” తెలుగు రిలీజ్ కి డేట్స్ ఫిక్స్.!

Published on Jul 2, 2023 8:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో మన టాలీవుడ్ కి అడాప్టెడ్ సన్ అయినటువంటి సూర్య హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో క్లాసిక్ హిట్ చిత్రం “సూర్య సన్నాఫ్ కృష్ణన్” కూడా ఒకటి. వెర్సటైల్ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం మ్యూజికల్ గా సహా సినిమా కంటెంట్ పరంగా కూడా అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియెన్స్ మన్ననలు కూడా పొందింది.

దీనితో ఓ క్లాసిక్ గా నిలిచిన ఈ చిత్రం కి తెలుగు ఫ్యాన్స్ కూడా ఎక్కువే కాగా ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ఫైనల్ గా వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ అవైటెడ్ రీ రిలీజ్ ని మేకర్స్ ఈ జూలై 21 కి ఇండియా లోని అలాగే జులై 19న యూఎస్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ ఇది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సమీరా రెడ్డి, సిమ్రాన్ లు ఫీమేల్ లీడ్ లో నటించగా హరీష్ జై రాజ్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు